లైడిటెక్టర్‌ పరీక్షలకు రేవంత్ సిద్ధమా? వైట్ ఛాలెంజ్‌ పై మంత్రి కేటీఆర్ స్పందన

KTR initiates legal action against Opposition, KTR Ready To Take Drug Test, KTR Responds Over White Challenge, KTR Responds Over White Challenge Thrown by TPCC President, Mango News, Minister KTR Responds Over White Challenge Thrown by TPCC President Revanth Reddy, PCC Chief Revanth Reddy Comments On Minister KTR, rahul gandhi, Revanth Reddy white challenge at KTR, Revanth throws white challenge against drug abuse, TPCC President Revanth Reddy, TPCC President Revanth Reddy Takes Lie Detector Test In #Note4Vote Case, TPCC Revanth Reddy On Drugs, Vote For Note Case

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం స్పందించారు. తాను ఏ పరీక్షకు అయినా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాహుల్ గాంధీ కూడా ఈ ఛాలెంజ్ లో చేరడానికి సిద్ధంగా ఉంటే ఢిల్లీ ఎయిమ్స్ కు వెళ్తానని చెప్పారు. అయితే చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో కలిసి టెస్టులు చేయించుకునే స్థాయి త‌న‌ది కాదని అన్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే ఈ పరీక్షల్లో తనకు క్లీన్‌చిట్‌ వస్తే రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పి తన పదవులు వదులుకుంటారా? ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమా అని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.

మరోవైపు తనపై చేస్తున్న ఆరోపణలపై ఈ రోజు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. పరువు నష్టం మరియు ఇన్ జస్టిస్ పై హైకోర్టులో దావా వేసినట్టు తెలిపారు. న్యాయస్థాన ప్రక్రియ తనపై చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని స్పష్టంగా రుజువు చేస్తుందనే నమ్మకం ఉందని, మరియు నేరస్థులు తగిన విధంగా బుక్ చేయబడతారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ముందుగా రేవంత్‌ రెడ్డి ఇటీవల మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి వైట్‌ ఛాలెంజ్‌ విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్ లో భాగంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం వద్దకు రావాలని, అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి డ్రగ్స్‌ పరీక్షల కోసం వైద్యులకు నమూనాలు ఇద్దామని సవాల్ విసిరారు. రేవంత్‌ విసిరిన వైట్‌ ఛాలెంజ్‌కు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ, మధ్యాహ్నం 12గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు రానున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ కూడా రేవంత్ ఛాలెంజ్ పై స్పందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =