వక్ఫ్ బోర్డు ఆస్తులపై సీబీసీఐడీ విచారణ చేపట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హోం శాఖ మంత్రి హర్షం

Home Minister Mahmood Ali Welcomes CM KCR Decision to Conduct CBCID Inquiry on Waqf Board Assets,Mango News,Mango News Telugu,Home Minister Mahmood Ali,Home Minister Mahmood Ali Live,Home Minister Mahmood Ali Live News,Home Minister Mahmood Ali Latest News,Home Minister Mahmood Ali Latest,Home Minister Mahmood Ali Live Speech,Home Minister Mahmood Ali Speech,Home Minister Mahmood Ali News,Home Minister Mahmood Ali Welcomes CM KCR Decision,CBCID,Waqf Board Assets,CM KCR Key Decision On Waqf Board Lands,CBCID Inquiry On Waqf Lands,CBCID Inquiry on Waqf Board Assets,Home Minister Mahmood Ali on Waqf Board Assets,Home Minister Mahmood Ali Live Updates,Home Minister Mahmood Ali Live News Today,CM KCR,CM KCR Latest News,CM KCR News,CM KCR Live,CM KCR Live Today,CM KCR Latest

వక్ఫ్ బోర్డు ఆస్తులపై సీబీసీఐడీ విచారణ చేపట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ హర్షం వ్యక్తం చేశారు. వక్ఫ్ మరియు దేవాదాయ ఆస్తులను రక్షించడం పట్ల సీఎం కృత నిశ్చయంతో ఉన్నారని హోం మంత్రి అన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా తమ చిత్తశుద్ధిని తెలియజేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరగనున్న భూముల సర్వే ద్వారా పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలు జరిగాయనే ఆరోపణలున్నాయన్నారు. ఇందులో ప్రస్తుత ప్రభుత్వ ప్రమేయం లేదని ఆయన అన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించడం ద్వారా సీఎం కేసీఆర్ సరికొత్త రికార్డు సృష్టించారని, ఈ సందర్బంగా సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ