వ్యాక్సినేషన్ ఒకటే కరోనాకు సమాధానం: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

Telangana Governor Tamilisai Soundararajan Participated in various Programs in Nalgonda District,Mango New,Mango News Telugu,Telangana Governor Tamilisai Soundararajan,Telangana Governor Tamilisai Soundararajan Live,Governor Tamilisai Soundararajan,Tamilisai Soundararajan,Soundararajan,Tamilisai Soundararajan Latest News,Tamilisai Soundararajan Live Updates,Tamilisai Soundararajan News,Tamilisai Soundararajan Latest,Tamilisai Soundararajan Live Speech,Telangana Governor,Nalgonda District,Nalgonda,Nalgonda News,Tamilisai Soundararajan Participated in various Programs in Nalgonda,Telangana Governor Tamilisai Soundararajan Visits Nalgonda District,Telangana News,Tamilisai Soundararajan Visits Nalgonda District,COVID-19,COVID-19 In Nalgonda,Nalgonda Vaccination

వ్యాక్సినేషన్ ఒకటే కరోనాకు సమాధానమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. గురువారం నాడు గవర్నర్ నల్గొండ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని సింధూర ఆసుపత్రిలో కిడ్నీ కేర్, డయాలసిస్ సెంటర్లను ఆమె ప్రారంభించారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో సెమినార్ హాల్ కు అదేవిధంగా బ్లడ్ కలెక్షన్, అంబులెన్స్ వాహనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం పానుగల్లులోని ఛాయా సోమేశ్వర ఆలయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి గవర్నర్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. పురావస్తు శాఖ గైడ్ ఆలయానికి సంబంధించిన చరిత్రను రాష్ట్ర గవర్నర్ కు వివరించారు.

తదుపరి మహాత్మా గాంధీ యూనివర్సిటీ సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ చేశారు. యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం సందర్శించి రక్తదానం చేసిన యువతీ యువకులను అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. క్యాంపస్ లో గవర్నర్ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలతో బతుకమ్మ ఆడారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సిహెచ్.గోపాల్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి. విష్ణుదేవ్, ఇసి మెంబర్లు గవర్నర్ కు సన్మానం చేసి జ్ఞాపక అందజేశారు.

ఈ సందర్భంగా సింధూర హాస్పిటల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని, పేదలకు అందుబాటులో మినిమమ్ రుసుముతో నాణ్యమైన వైద్య సహాయం అందించాలని ఈ సందర్భంగా డాక్టర్లను కోరుతున్నానని అన్నారు. ప్రస్తుత సమయంలో కిడ్నీ, డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడం పట్ల సింధూర ఆసుపత్రి యజమాన్యం నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య, గైనకాలజిస్ట్ డాక్టర్ సింధూరలను ఆమె అభినందించారు. తమ కుటుంబంలో కూడా తాను గైనకాలజిస్ట్ గా, తన భర్త నెఫ్రాలజిస్ట్ గా వైద్య సేవలను అందించామని గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యం కోసం ముందే జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చని అన్నారు. కరోనా మహమ్మారికి వ్యాక్సినేషన్ ఒకటే సమాధానం అని, ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని అలాగే తప్పనిసరిగా మాస్క్ లు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ప్రజలను కోరారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, 1958లో నల్లగొండలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ ఏర్పాటు జరిగిందని, దక్షిణ భారతదేశంలోనే చాలా పాతదని, తన సేవల ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేయడం జరిగిందని, కోవిడ్, తుఫాను సమయాలలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టిందని అన్నారు. కోవిడ్ సమయంలో లక్షకు పైగా మాస్కులు, పళ్ళు, బలవర్ధకమైన ఆహారాన్ని వివిధ రూపాలో అందజేసిందని అభినందించారు. రక్తహీనత కలిగిన తలసేమియా వ్యాధి గ్రస్తులకు తన సేవలను అందించడం అభినందనీయమని అన్నారు.

నల్గొండ లోక్ సభ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, చారిత్రక నేపథ్యం ఉన్న నల్గొండకు రాష్ట్ర గవర్నర్ రావడం చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు. కిడ్నీ కేర్, డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడం పట్ల సింధూర హాస్పిటల్ యజమాన్యాన్ని అభినందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమాల్లో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సెక్రటరీ టు గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కె.సురేంద్రమోహన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ సీఈఓ కె.మదన్మోహన్రావు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఏ.వి.రంగనాథ్, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వి. చంద్రశేఖర్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =