తెలంగాణ విద్యుత్‌ వ్యవస్థపై దాడికి చైనా హ్యాకర్ల ప్రయత్నం

40 sub-stations in Telangana too faced attack from Chinese, Another Mumbai-Like Blackout, CERT-In alert helps avert bid to hack TS power systems, Chinese Hackers, Chinese hackers attempt to block power supply, Chinese hackers attempt to block power supply in Telangana, Chinese Hackers Attempt to Communicate Telangana Power System, Chinese hackers tried to block Telangana power supply, Mango News, Mumbai Power Blackout, telangana, Telangana Faces Cyber Attack, Telangana Power System

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ శాఖ‌ సర్వర్లు హ్యాక్‌ చేసేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను పర్యవేక్షణ చేసే తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (టీఎస్‌ఎల్‌డిసి) తో కమ్యూనికేట్ అయ్యేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. చైనాకు చెందిన కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్లు టీఎస్‌ఎల్‌డిసి వ్యవస్థలతో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సిఇఆర్టి-ఇన్) తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిందని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడించారు. అలాగే సమాచారం అనంతరం అన్ని భద్రతా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

టీఎస్‌ఎల్‌డిసి నుంచి రిమోట్‌ ఆపరేషన్‌ ద్వారా రాష్ట్రంలో పలు విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలోని సర్క్యూట్‌ బ్రేకర్లను నియంత్రించే వ్యవస్థ తాత్కాలికంగా డిజేబుల్‌ చేయడం, కొన్నిఅనుమానిత సర్వర్ ఐపీలను బ్లాక్ చేయడం, టీఎస్‌ఎల్‌డిసి వెబ్‌సైట్‌ యొక్క యూజర్ క్రెడెన్షియల్స్ మార్చడం వంటి చర్యలు తీసుకున్నామని తెలిపారు. కొన్ని సబ్ స్టేషన్లకు చైనాకి చెందిన థ్రెట్ యాక్టర్ ప్రవేశించినట్లు తెలుస్తోందని, అన్ని మాల్వేర్లను తొలగించామని అన్నారు. రాష్ట్రంలోని వినియోగదారులందరికీ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండేలా సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. దేశంలో ఏడు రాష్ట్రాల్లోని విద్యుత్ వ్యవస్థలతో చైనా హ్యాకర్లు కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించారని, అందులో తెలంగాణ కూడా ఒకటని చెప్పారు. రాష్ట్ర విద్యుత్ సాంకేతిక విభాగం అప్రమత్తంగా ఉందని, హ్యాకింగ్ చర్యలను నిరోధించేలా అన్ని చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =