ఏపీలో కరోనా: కొత్తగా 326 పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు

Andhra Pradesh : 326 New Covid-19 Positive Cases, 4 Deaths Reported Today

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 37,985 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 326 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరులో 68, కృష్ణాలో 47, నెల్లూరులో 45, తూర్పుగోదావరిలో 44, గుంటూరులో 37 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,67,255 కు చేరుకుంది.

ఇక కరోనా వలన మరో 4 మరణాలు చోటుచేసుకున్నాయి. గుంటూరులో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14386 కి పెరిగింది. గత 24 గంటల్లో 466 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,48,971 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,898 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ