ఆసుపత్రిలో పల్లా శ్రీనివాసరావును పరామర్శించిన చంద్రబాబు

TDP Chief Chandrababu Visits Palla Srinivasa Rao at Hospital, Mango News, Palla Srinivasa Rao Hunger Strike, Palla Srinivasa Rao Shifted To Hospital 6 Days After His Hunger Strike, Privatisation of Visakhapatnam Steel Plant, Privatisation of Visakhapatnam Steel Plant News, privatisation of Vizag Steel Plant, TDP Member Palla Srinivasa Rao, Visakhapatnam Steel Plant, Visakhapatnam Steel Plant News, Vizag Steel Plant, Vizag Steel Plant Issue

విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఫిబ్రవరి 10 వ తేది నుంచి ఆమరణ దీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు ఆరోగ్యం క్షిణిస్తుండంతో, సోమవారం రాత్రి ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేసి నగరంలోని కిమ్స్ ఐకాన్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో విశాఖపట్నం చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి వెళ్లి పల్లా శ్రీనివాసరావును పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

కాగా విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకునేంతవరకు దీక్షను కొనసాగిస్తానని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వెంట టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఇతర పార్టీ నాయకులు ఉన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 3 =