తిరుపతిలో నవంబర్‌ 14న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్ సమావేశం, ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష

CM YS Jagan Held Review Meeting over 29th Southern Zonal Council Meeting

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన నవంబర్‌ 14వ తేదీన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్ 29వ సమావేశం ఏపీలోని తిరుపతిలో జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి, అండమాన్‌నికోబార్‌, లక్షద్వీప్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లు కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్ సమావేశం ఏర్పాట్లపై సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం నాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆ వేదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్ర‌స్తావించ‌నున్న అంశాల‌ను అధికారులు సీఎంకు నివేదించారు. ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు, ప్రత్యేక హోదా, తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, విద్యుత్‌ బకాయిలు సహా పలు అంశాలను అజెండాలో పొందుపరిచామని సీఎం వైఎస్ జగన్‌ కు అధికారులు వివరించారు. మరోవైపు రాష్ట్రానికి సంబంధించి ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాలపై కూడా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + two =