పోడు భూముల సమస్యను పరిష్కరించుటకు చేపట్టాల్సిన చర్యల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లు, డి.ఎఫ్.ఓ లు, అదనపు కలెక్టర్లు, డి.పి.ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పోడు భూముల సమస్యను పరిష్కరించుటకు ఎఫ్.ఆర్.సి లతో పాటు గ్రామ పంచాయతీ, మండల, డివిజన్, జిల్లా స్థాయి బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఎస్ తెలిపారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో భాగంగా మొదటగా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తుల నుండి క్లయిమ్ లను స్వీకరించుటకు ఆవాసాల వారిగా సరిపడా ఫారమ్ –ఎ లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అదే విధంగా పూర్తి చేసిన ఫారమ్-ఎ దరఖాస్తులను అందజేసేందుకు గ్రామస్తులకు తగినంత సమయాన్ని ఇవ్వాలని సూచించారు.
పోడు భూములపై గ్రామస్తుల నుండి ఫారమ్–ఎ ప్రకారం క్లయిమ్ ల స్వీకరణ, అవగాహన కార్యక్రమాలను ఈ నెల 8 వ తేదీ నుండి ప్రారంభించాలని సీఎస్ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ అంశంపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిపారు. పోడు భూములపై గ్రామస్తులకు అవగాహన కల్పించి, పూర్తి చేసిన క్లయిమ్ లు స్వీకరించుటకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆవాసాల వారిగా గ్రామ పంచాయతీ స్థాయి బృందాలు, ఎఫ్.ఆర్.సి లు గ్రామస్తుల నుండి పూర్తి చేసిన క్లయిమ్ లను తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సి.సి.ఎఫ్.శోభ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమీషనర్ శేషాద్రి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిష్టినా జడ్ చొంగ్తు, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్ డి ప్రియాంకా వర్గీస్, అడిషనల్ పిసిసిఎఫ్ఎన్.సి పరాజిన్, అడిషనల్ పిసిసిఎఫ్ స్వర్గం శ్రీనివాస్, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ