తెలంగాణ ప్రభుత్వ కృషితో, ప్రగతి బాటలో విద్యా వ్యవస్థ – టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

Telangana Education System is on The Path of Progress Says TRS MLC Kavitha, TRS MLC Kavitha, Telangana Education System is on The Path of Progress, Focus On Studies Don’t Fall In Opposition’s Trap Says Kavitha Kuntala, Kavitha Kuntala Says Focus On Studies, Kavitha Kuntala Says Don’t Fall In Opposition’s Trap, Kavitha Kuntla posted a video message on Twitter, Kavitha Kuntla video message, Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Government, 2022-2023 Budget Session, Telangana Budget Session 2022, Telangana Budget Session, TS Budget Session, 2022 Telangana Budget Session, Telangana Assembly Budget Session 2022-23, Telangana Assembly Budget Session 2022, Telangana Assembly Budget Session, Telangana Assembly Budget, Telangana assembly budget session, Telangana Budget 2022-23, Telangana Budget 2022, Telangana Budget, Telangana Assembly, Telangana Assembly, Telangana Assembly Session, Manog News, Manog News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కృషితో విద్యా వ్యవస్థ ప్రగతి బాటలో పయనిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో జయచంద్రిక అనే ఒక తెలంగాణ ఉద్యమకారిణికి ఉన్నత విద్య కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్సీ కవిత చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను అందించనుండటంవల్ల విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని కవిత అన్నారు.

ప్రతి జిల్లాలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని.. పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలకు ఇది ఒక అద్భుత అవకాశం అని ఆమె తెలిపారు. అంతేకాకుండా, విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిస్తోందని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. కాగా, జయచంద్రిక చిన్నప్పటినుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఉద్యమ ప్రదర్శనలు జరిగిన ఆమె ఉత్సాహంగా పాల్గొనేవారు. ఆ రోజుల్లో జయచంద్రిక తెలంగాణ తల్లి వేషాధరణతో చాలా పాపులర్ అయ్యారు. ఈ సందర్భంగా దీనిని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =