20వ రోజుకు చేరిన వైఎస్ షర్మిల ‘ప్ర‌జా ప్ర‌స్థానం’ పాదయాత్ర

Mango News, Praja Prasthanam Padayatra, Praja Prasthanam Padayatra Reached to 20 th Day, Telangana Politics, YS Sharmila, YS Sharmila Latest News, YS Sharmila Launches Praja Prasthanam Padyatra, YS Sharmila Praja Prasthanam Padayatra, YS Sharmila Praja Prasthanam Padayatra Reached, YS Sharmila Praja Prasthanam Padayatra Reached to 20 th Day, YSR Telangana Party chief YS Sharmila, YSR Telangana Party president YS Sharmila, YSRTP Chief YS Sharmila

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్ర‌జా ప్ర‌స్థానం’ పేరుతో అక్టోబరు 20వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్ర‌జా ప్ర‌స్థానం పాదయాత్ర‌ 20వ రోజుకు (నవంబర్ 8, సోమవారం) చేరుకుంది. సోమవారం ఉదయం 10 గంటలకు నల్గొండ జిల్లా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలోని మునుగోడు మండ‌లం కచలాపురం గ్రామంలో వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభ‌మైంది. అక్కడి నుంచి పలిమెల, వూకొండి, సింగారం, పులిపలుపుల గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. సాయంత్రం రాత్ పల్లి గ్రామంలో వైఎస్ షర్మిల మాటా-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎలికట్టే క్రాస్ వద్ద ప్రజలతో ఇంటరాక్షన్ నిర్వహించి, సాయంత్రం 6 గంటలకు ఎలికట్టే క్రాస్ వద్దే 20వ రోజు పాదయాత్రను వైఎస్ షర్మిల ముగించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ