దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 113 కోట్లు దాటింది. ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుండగా, నవంబర్ 17, బుధవారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 113.68 కోట్లు (1,13,68,79,685) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కాగా గత 24 గంటల్లోనే 67.82 లక్షలమందికి పైగా (67,82,042) వ్యాక్సిన్ తీసుకున్నట్టు పేర్కొన్నారు.
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వివరాలు (నవంబర్ 17, ఉదయం 7 గంటల వరకు):
- హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,03,80,957
- హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 93,53,906
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,83,74,594
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 1,62,19,699
- 18-44 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 43,57,31,810
- 18-44 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 17,67,65,054
- 45-59 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 17,90,55,132
- 45-59 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 10,67,80,250
- 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు): 11,21,81,588
- 60 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు): 7,20,36,695
- పంపిణీ చేసిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 1,13,68,79,685
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ