జమున హేచరీస్ భూముల్లో సీలింగ్ ల్యాండ్ ఉంది – మెదక్ కలెక్టర్

bjp, BJP MLA Eatela Rajender, Collector Harish Speaks On Eatela’s Jamuna Hatcheries Issue, Eatala Rajender for probe into land grab, Eatala Rajender lands, Eatela Rajender, Eatela Rajender land, Eatela Rajender land issue, ex-minister Eatela land grabbing case, Inquiry ordered into another land grabbing issue, Medak Collector Harish, Medak Collector Harish Speaks On Eatela’s Jamuna Hatcheries Issue, Probe into ex-minister Eatela land grabbing case, telangana, Telangana News, TRS

హుజురాబాద్ శాసన సభ్యులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు చెందిన జమున హేచరీస్ భూముల్లో సీలింగ్ ల్యాండ్ ఉందని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. 56 మందికి సంబంధించిన 70 ఎకరాల భూమిని జమున హేచరీస్ కబ్జా చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అయితే, జమున హేచరీస్ భూముల్లో సీలింగ్ ల్యాండ్ ఉందని కాలుష్య నియంత్రణ మండలి నివేదికలో తేలినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ భూముల్లో పెద్ద పెద్ద షెడ్లు కూడా నిర్మించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. హేచరీస్ కి దగ్గరలో ఉన్న ఎల్క చెరువు, హల్దీవాగు లోకి పౌల్ట్రీ వ్యర్ధాలను కలుపుతున్నట్లు స్థానికులు కొందరు ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్ తెలియచేసారు. గత కొన్నిరోజుల క్రితం ఈ వ్యవహారం రాష్ర వ్యాప్తంగా పెను సంచలనానికి కారణమయింది. ఇప్పుడు మరోసారి ఈ భూముల వ్యవహారం చర్చనీయాంశం అయింది. దీనిపై ఈటల రాజేందర్ స్పందన తెలియ రావాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ