హైటెక్ గ్యాడ్జెట్‌‌తో డ్రగ్స్​‌పై నజర్

New Year Celebrations Conditions, New Year Celebrations, Conditions, Drugs With Hitech Gadget, New Year Latest News, Latest New Year News Update, New Year Celebrations 2024, 31 St Night Celebrations, 31 St Night, Covid Pandemic, New Year Celebrations Hyderabad,Hyderabad, Restrictions On News Year Celebrations, Cyberabad Police, Telangana News, Hyderbad News Updates, Mango News, Mango News Telugu
New Year Celebrations, Conditions, drugs with hi-tech gadget,

ఈ సారి కొత్త సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు రెట్టింపు చేశారు. అర్ధరాత్రి రోడ్లపై జరిగే హంగామాలకు చెక్ పెట్టడానికి రాత్రి 8 గంటల నుంచే తనిఖీలు చేపట్టడానికి రెడీ అవుతున్నారు. ఆకతాయిలను కంట్రోల్ చేయడానికి హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్లతో పాటు కొన్ని రోడ్లను మూసి వేయనున్నారు. డ్రగ్స్ అదుపుపై దృష్టి పెట్టిన నార్కొటిక్ అనాలసిస్ బ్యూరో.. రెండు అధునాతన గ్యాడ్జెట్లను పోలీసులకు అందుబాటులోకి తెచ్చింది.

ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడో కూడా  లేదో కూడా హైటెక్ గ్యాడ్జెట్‌‌తో తెలుసుకోవచ్చు. పబ్స్ లోపల, ట్రాఫిక్ చెక్‌పోస్టులు, ఫామ్‌హౌస్‌ల వద్ద ఈ  హైటెక్ గ్యాడ్జెట్‌లను వినియోగిస్తారు. దీనిలో రెండు కిట్లు ఉండగా..ఒక కిట్ సాయంతో డ్రగ్స్​ వాడిన వ్యక్తి లాలాజల శాంపిల్ ను టెస్ట్ చేసి  అతని బాడీలో డ్రగ్​ మోతాదును గుర్తిస్తారు. రెండో కిట్ సాయంతో ​మూత్ర నమూనాల ద్వారా డ్రగ్స్ వాడినట్టు నిర్ధారించవచ్చు.

న్యూ ఇయర్ వేడుకలలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. డిసెంబర్ల 31న రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్​ తనిఖీలు ముమ్మరం చేస్తామని పోలీసులు చెప్పారు. సిటీలోని గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్, షేక్‌పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్,  రోడ్ నెం.45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్ ఫ్లైఓవర్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, బాబు జగజీవన్ రామ్ ఫ్లైఓవర్, ఎఫ్. వీటితో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలను కూడా మూసివేస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి జనవరి ఉదయం 5 గంటల వరకు హైదరాబాద్​ నగరంలోని ప్రధాన ఫ్లై ఓవర్లతో పాటు కొన్ని రోడ్లను మూసివేస్తున్నట్లు పోలీసులు ఇప్పటికే ప్రకటించారు.

న్యూ ఇయర్ వేడుకలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 31న డ్రగ్స్, లిక్కర్​ తాగి వెహికల్స్​ నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు రెడీ అయ్యారు. 31న డ్రంకెన్​ డ్రైవ్​లో పట్టుబడిన వారికి రూ.15 వేల వరకు జరిమానాతోపాటు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని పోలీసులు తెలిపారు. డ్రంకెన్​ డ్రైవ్​లో మొదటిసారి దొరికిన వారికి  రూ. 10,000 వరకు జరీమానాతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష ..రెండోసారి లేదా అంతకంటే ఎక్కువ పట్టుబడిన వారికి రూ. 15,000 జరిమానాతో పాటు రెండేళ్లు  జైలు శిక్ష ఉంటుందని తెలిపారు.  అవసరమైతే డ్రైవింగ్ లైసెన్సులు జప్తు చేయడం, లేదంటే శాశ్వతంగా రద్దు చేసే అవకాశాలున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు ఈ నెల  31న  అదనపు చార్జీలు వసూలు చేయవద్దని ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లకు ఇప్పటికే  ఆదేశాలు జారీ చేసిన పోలీసులు.. ఒకవేళ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే జరీమానా విధిస్తామని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు ఆరోజు తప్పనిసరిగా యూనిఫాం ధరించడంతో పాటు.. అన్ని పత్రాలను దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ప్రయాణికులను తీసుకెళ్లడానికి  నిరాకరిస్తే  అతనికి రూ. 500 జరిమానా విధిస్తామని అన్నారు.ఒకవేళ డ్రైవరు తమ గమ్యస్థానాలకు చేర్చడానికి నిరాకరిస్తే  9490617346 నంబర్‌కు ఫోన్​ చేసి తమకు కంప్లైంట్ చేయొచ్చని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − thirteen =