ఈ సువిశాల ప్రపంచంలో వింతలకు కొదవే లేదు. మన చుట్టూ ఉండే ప్రపంచంలో మనకే తెలియని ఎన్నో వింతలూ, విశేషాలు ఉంటుంటాయి. చిత్ర విచిత్రమైన ప్రాణులు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఇప్పటికే ఎన్నో రకాల జీవులను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. కానీ, ఇప్పుడు మనం తెలుసుకోబోయే వార్త వింటే మాత్రం నిజంగానే ఆశ్చర్యపోతాం. ఇప్పటివరకు మనం కనీ వినీ ఎరుగని ఒక వింత జీవిని కనుగొన్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. ప్రపంచంలోనే అత్యధిక కాళ్లు కలిగిన జీవిని వారు కనుగొన్నారు. మిలపీడ్ (Millipede) జాతికి చెందిన ఈ జీవి 1,306 కాళ్లను కలిగి ఉంది. అయితే ఇది కేవలం 95 మిల్లీమీటర్లు పొడవు మాత్రమే ఉండటం విశేషం. పశ్చిమ ఆస్ట్రేలియా లోని మైనింగ్ జోన్ లో 60 మీటర్ల (సుమారు 200 అడుగులు) లోతులో ఈ జీవిని గుర్తించారు. దీనికి గ్రీకు పాతాళ దేవత పెర్సెఫోన్ పేరు మీద ‘’యుమిల్లిప్స్ పెర్సెఫోన్’’ అని పేరు పెట్టారు వారు.
మిలపీడ్ అంటే?
వర్జీనియాకు చెందిన ప్రముఖ కీటక శాస్త్రవేత్త పాల్ మారెక్, ఒక సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ఈ విధంగా పేర్కొన్నారు.. మిలపీడ్ అంటే ‘వెయ్యి కాళ్లు’ అని అర్థం. కానీ.. ఇప్పటివరకు మనం చూసిన మిలపీడ్‌లకు నిజంగా 1000 కాళ్లు లేవు. ఇప్పటివరకు మనం చూసిన వాటిలో అత్యధిక కాళ్లు కలిగిన జీవి సెంట్రల్ కాలిఫోర్నియాలో బయటపడిన ఇలాక్మే ప్లెనిప్స్. ఇది 750 కాళ్లను కలిగి ఉంటుంది. కానీ.. తాజాగా బయటపడ్డ జీవికి 1306 కాళ్ళు ఉండటం ఆశ్చర్యం. ఇది నిజమైన మిలపీడ్ అని అన్నారు.
ఆస్ట్రేలియాలోని మరో ప్రముఖ జీవ శాస్త్రవేత్త అయిన బ్రూనో బుజాట్టో కూడా దీనిపై స్పందించారు. ‘’ఇది ఒక అద్భుతమైన జీవి. మిలపీడ్స్‌లో వెలుగు చుసిన అత్యంత పొడవైన జీవి ఇదే. భూమిని జయించిన మొదటి జీవులు. ఇవి మట్టిలో పదుల మీటర్ల లోతులో అత్యంత కఠినమైన వాతావరణంలో జీవించడానికి అలవాటుపడ్డాయి. కానీ, భూ ఉపరితలంపైన జీవించి ఉన్న మిల్లిపెడెస్ లను కనుగొనడం చాలా కష్టంతో కూడుకున్నది” అని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ