కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 38,929 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,824 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.68 శాతంగా నమోదైంది.
అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 52,23,293 కు చేరుకుంది. ఇక కరోనాకు చికిత్స పొందుతూ మరో 16 మంది మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 46,586 కి పెరిగింది. కొత్తగా కరోనా నుంచి 3,364 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 51,65,164 కు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 22,691 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ