తెలంగాణ రాష్ట్రంలో మరో 3 ఒమిక్రాన్‌ కేసులు నమోదు

Coronavirus, COVID-19, covid-19 new variant, Covid-19 Updates in Telangana, Mango News, New Covid 19 Variant, Omicron, Omicron covid variant, Omicron variant, Omicron Variant Cases in Telangana, Omicron Variant in Telangana, Omicron Variant in Telangana Another 3 Cases Reported Total Count Reached to 44, telangana coronavirus cases today district wise, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list, Telangana New Covid-19 Positive Cases, Telangana Reports 3 New Omicron Cases Tally Reaches 44, Update on Omicron

తెలంగాణలో కొత్త కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా ఆదివారం నాడు మరో 3 ఒమిక్రాన్‌ కేసులు నమోదయినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసుల్లో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికీ, అలాగే ఒమిక్రాన్ సోకిన ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఒకరికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 44 కు చేరుకుంది. కాగా వీరిలో ఇప్పటికే 10 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు. మరోవైపు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలిన మరో 16 మంది శాంపిల్స్ ను ఇప్పటికే జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని, ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.

మరోవైపు తెలంగాణలో కొత్తగా 109 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 26, ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 6,80,662 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరోకరు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,022 కి పెరిగింది. కరోనా రికవరీ రేటు 98.90 శాతంకాగా, మరణాల రేటు 0.59 శాతంగా నమోదైంది. ఇక గత 24 గంటల్లో 190 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 6,73,223 కు చేరుకుంది. ప్రస్తుతం 3,417 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు ఆదివారం నాడు 20,576 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 2,95,16,467 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 7,93,027 ​పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 4 =