తెలంగాణ రాష్ట్రంలో రైతులకు డిసెంబర్ 28, మంగళవారం నుంచి రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిరోజు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలియజేశారు. తొలిరోజున 18,12,656 మంది రైతుల ఖాతాల్లోకి రూ.544.55 కోట్ల రైతుబంధు నిధులు జమ చేసినట్టు మంత్రి వెల్లడించారు. దేశానికి, ప్రపంచానికి రైతుబంధు, రైతుభీమా పథకాలు ఒక దిక్సూచి వంటివని, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవని అన్నారు.
“సమైక్య పాలనలో వట్టిపోయిన తెలంగాణ భూములు కేసీఆర్ ముందుచూపుతో పచ్చటి పంటలతో అలరారుతున్నాయి. ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం సంపూర్ణంగా మారిపోయింది. రైతులకు, వ్యవసాయ రంగానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుంది” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ యాసంగి సీజన్ లో 66.61 లక్షల మంది రైతులుకు గాను 152.91 లక్షల ఎకరాలకు రూ.7645.66 కోట్ల రైతుబంధు నిధులను ప్రభుత్వం జమచేయనుంది. ముందుగా ఎకరా నుండి రెండు, మూడు, నాలుగు ఎకరాల లెక్కన గతంలో మాదిరిగానే ఆరోహణా క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ జరుగుతుందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ