శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీలేని విధానాన్ని అవలంభిస్తోంది: హోంమంత్రి మహమూద్ అలీ

Telangana Home Minister Mahmood Ali Statement about Law and Order Situation in the State, Home Minister Mahmood Ali Statement about Law and Order Situation in the State, Mahmood Ali Statement about Law and Order Situation in the State, Law and Order Situation in the State, Telangana Law and Order Situation, Law and Order Situation, Telangana Home Minister Mahmood Ali, Home Minister Mahmood Ali, Mahmood Ali, Telangana Law and Order Situation News, Telangana Law and Order Situation Latest News And Updates, Telangana Law and Order Situation Live Updates, Mango News, Mango News Telugu,

శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీలేని విధానాన్ని అవలంభిస్తోందని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. ఇతర మతస్తుల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీసేవిధంగా మాట్లాడి తద్వారా అశాంతిని సృష్టించాలనుకునే వారిని తెలంగాణ ప్రభుత్వం సహించదని, చట్ట ప్రకారం కఠీనంగా వ్యవహరిస్తుందని హోంమంత్రి తెలిపారు. మహ్మద్ ప్రవక్త పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారని, ఎమ్మెల్యే రాజా సింగ్ పై హైదరాబాద్ మరియు తెలంగాణ రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు వచ్చాయని హోంమంత్రి అన్నారు. ఇట్టి ఫిర్యాదులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని, చట్టానికి, జాతి, మత, కుల, వర్గ ఇతర భేదాలు ఉండవని…చట్టానికి ఎవ్వరూ అతీతులు కారని, చట్టం తన పని తాను చేస్తుందని హోం మంత్రి పేర్కొన్నారు.

రాజా సింగ్ ను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేసారని హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ గుర్తు చేసారు. ప్రజలు వారి వారి మతాలకు, కులాలకు, ఆచారాలకు, సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా జీవించే హక్కు ఉందని, ఎవరూ తమ మతానికి వ్యతిరేకంగా ఎలాంటి అవాస్తవాలను, తక్కువ చేసి మాట్లాడడం వంటివి సహించరని, ఇతర మత విశ్వాసాలను మరియు ఆయా మత గురువులను ఉద్దేశించి కించపరచే లేదా తక్కువ చేసే విధంగా ఏమతం వారు అయినా మాట్లాడరాదని, వారి మనోభావాలను కించపరచే విధంగా మెలగరాదని, హోంమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేసారు. చట్టం నుండి ఎంతటి వారైనా తప్పించుకోలేరని, తెలంగాణ ప్రజలు గంగా-జమున తెహజీబ్ (సంస్కృతికి) ప్రతీకగా ఉన్నారని, ఎవ్వరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, ప్రజలు అందరూ సంయమనంతో, సోదరభావంతో ఉండాలని హోం మంత్రి విజ్ఞప్తి చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 14 =