తెలంగాణలో కరోనా: కొత్తగా 482 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 98.81%

Covid-19 in Telangana : 482 Positive Cases, 212 Recoveries Reported on Jan 3rd

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 482 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 3, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,82,971 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 212 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 6,74,892 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.

ఇక కరోనా వలన రాష్ట్రంలో మరొకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,031 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,048 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 294, రంగారెడ్డిలో 55, మేడ్చల్ మల్కాజ్గిరిలో 48, మహబూబాబాద్ లో 18 నమోదయ్యాయి.

మరోవైపు తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 84గా ఉంది. కొత్తగా రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాలేదు. కాగా గత 24 గంటల్లో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 423 మంది వచ్చారు. వారందరికీ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా, 23 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలినట్టు చెప్పారు. దీంతో వారి శాంపిల్స్ ను కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని, మొత్తం 53 మంది ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ