బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా నేడు బీజేపీ క్యాండిల్ ర్యాలీ

BJP Plans Protest March Privilege Motion Against Telangana Govt, Mango News, Nadda says Telangana BJP chief arrest murder of democracy, Nadda to visit Hyderabad today to protest against arrest of Telangana BJP chief, President Bandi Sanjay, Telangana BJP, Telangana BJP Chief Bandi Sanjay Arrested, Telangana BJP to Conduct Candlelight Rally, Telangana BJP to Conduct Candlelight Rally Today, Telangana BJP to Conduct Candlelight Rally Today to Protest the Arrest of State President Bandi Sanjay, Telangana State BJP president Bandi Sanjay sent to 14 days

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను నిన్న కరీంనగర్లో పోలీసులు అరెస్ట్ చేయటం, కోర్టులో హాజరు పరచటం, కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించటం తెలిసిన విషయమే. అయితే, సంజయ్ ను అరెస్ట్ చేసిన తీరుపై బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జీవో 317కు నిరసనగా.. సంజయ్‌ తన క్యాంపు కార్యాలయంలో జన జాగరణ దీక్షకు పూనుకున్నారు. అయితే, ఈ దీక్షను భగ్నం చేయటానికి పోలీసులు కార్యాలయం తాళాలు పగలగొట్టి మరీ సంజయ్ ను అరెస్ట్ చేయటం, ఆయనపై కేసులు పెట్టడంపై బీజేపీ పార్టీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

బండి సంజయ్‌ తోపాటు కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయటంతో బీజేపీ పార్టీ నాయకులు అందరూ పోలీసుల చర్యను ముక్త కంఠంతో ఖండించారు. ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, విజయశాంతి వంటి సీనియర్ నాయకులు కెసిఆర్ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. సంజయ్‌ తోపాటు కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కాగా, బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ పార్టీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here