మార్చిలో జరుగనున్న పదవ తరగతి పరీక్షలు – స్పష్టం చేసిన ‌ఏపీ మంత్రి సురేష్‌

ఏపీలో పదవ తరగతి పరీక్షలు మార్చి నెలలో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. సిలబస్ ను సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని విద్యాసంస్థలకు ఆయన సూచించారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు ప్రతి స్కూల్లో వ్యాషినేషన్ 95% పూర్తి చేశామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో అమ్మఒడి మూడో విడత ఇస్తామని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని కారణంగా 375 బీఈడీ, డీఈడీ కాలేజీలు మూతపడ్డాయని.. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ తెలియజేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. చట్టసవరణ ద్వారా ప్రైవేటు యూనివర్సిటీల్లో 35% ఫ్రీ సీట్లు ఇప్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ విద్యార్ధి కూడా.. ఆర్ధిక సమస్యల కారణంగా చదువుకు దూరం కాకూడదని అమ్మఒడి ఇస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే, విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలతో పాటుగా మధ్యాహ్నం పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు మంత్రి సురేష్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ