కాచిగూడ రైల్వే స్టేషన్‌లో రెట్టింపైన ప్లాట్‌ఫామ్ టికెట్ ధర

Kacheguda,Hyderabad Platform Ticket Rates Hiked at Kacheguda Station, Kacheguda Station, Ticket Rates Hiked, Ticket Rates, Platform Ticket Rates, Railway Platform Ticket, Platform Ticket Rate Hiked in Kacheguda Station, Ticket Rates, Ticket Prices, Platform Tickets Hiked, Hyderabad Platform Ticket, Hyderabad Platform Ticket Rates, Mango News,

సంక్రాంతి పండగ వేళ ప్రయాణికులకు రైల్వే శాఖ షాకిచ్చింది. ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రెట్టింపు చేసింది. హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచింది. ఈ నెల 20 వరకు ఇదే ధర కొనసాగనుంది. కోవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్‌లో రద్దీని నియంత్రించేందుకు మరియు ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. సంక్రాంతి పండగ కారణంగా రైల్వే స్టేషన్‌లో రద్దీ విపరీతంగా పెరిగిందని సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది.

సాధారణంగా ప్రయాణికులకుతో పాటుగా.. వారి వెంట వచ్చేవారితో అన్ని రైల్వే స్టేషన్స్ ‌లో నిత్యం రద్దీగా ఉండటం తెలిసిన విషయమే. అయితే, ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను పెంచినందున కొంతవరకు రద్దీని తగ్గించవచ్చునని రైల్వే శాఖ భావిస్తోంది. గతేడాది కరోనా సెకండ్ వేవ్ సమయంలో రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను ఏకంగా రూ.50కి పెంచిన సంగతి తెలిసిందే. కరోనా స్వైర విహారం చేయడంతో రైల్వే స్టేషన్లలో రద్దీ నియంత్రణకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మళ్ళీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాక టికెట్ ధరను తగ్గించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ