5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ

Election Commission Announces Poll Schedule For Five States, Details Here, Election Commission, Assembly Elections in 5 States, Election Commission Schedule, Assembly Elections, 5 States, 5 States Dates For Assembly Elections, EC, EC Updates, EC Live Updates, Assembly Election 2022 Dates, poll dates for 5 states, 5 states Elections 2022, Assembly Elections Live Updates, Upcoming elections in India 2022, Elections 2022 In which states, Mango News,Mango News Telugu, Assembly elections 2022, 2022 Assembly elections,

గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2024లో జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికల కోసం ప్రజల నాడిని తెలుసుకోవడానికి ఈ శాసన సభల ఎన్నికల ఫలితాలు ఉపయోగపడతాయి. ఉత్తర ప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 శాసన సభ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 10న మొదలయ్యే ఎన్నికల షెడ్యూల్ మార్చి 7తో ముగియనుంది. ఫలితాలు మార్చి 10న ప్రకటిస్తారు.

అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో 7 విడతలుగా.. మిగిలిన రాష్ట్రాలలో ఒకే విడతలో పోలింగ్ జరుపనున్నారు. ప్రస్తుతం పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఎన్నికలను మినీ జాతీయ ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర.. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే కూడా పాల్గొన్నారు. దేశంలో కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలకు జాగ్రత్తలు తీసుకున్నామని సీఈసీ వెల్లడించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎన్నికల నిర్వహణ భారీ సవాలుగా నిలువనుందని అన్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లోని 690 నియోజకవర్గాల్లో కోవిడ్ రహిత, సురక్షిత ఎన్నికలను నిర్వహించడమే తమ లక్ష్యమని తెలిపారు.

వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించినట్లు తెలియజేసారు. ఈ ఎన్నికల్లో 18 కోట్ల మందికి పైగా ఓటర్లు పాల్గొంటారని తెలిపారు. ఈసారి 18.34 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 24.9 లక్షల మంది ఓటర్లు తొలిసారిగా ఓటు వేయనున్నారని తెలిపారు.. ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + fifteen =