దేశవ్యాప్తంగా ఇటీవల పలువురు సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ మలయాళ యువ కథానాయకుడు, స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇంట్లో ఒంటరిగా ఉన్నాను మరియు తేలికపాటి ఫ్లూ లక్షణాలను కలిగి ఉన్నాను కానీ నేను బాగానే ఉన్నాను. గత కొన్ని రోజులుగా షూటింగ్ సమయంలో నాతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు లక్షణాలను గమనించినట్లయితే, దయచేసి ఇతరులతో వేరుగా ఉండి కరోనా పరీక్షలు చేయించుకోండి. ఈ మహమ్మారి ఇంకా ముగియలేదు కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించి సురక్షితంగా ఉండాలి” అని దుల్కర్ సల్మాన్ పేర్కొన్నారు.
Positive. pic.twitter.com/cv3OkQXybs
— Dulquer Salmaan (@dulQuer) January 20, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF