మేడారం మహా జాతరకు.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు

2022 Medaram Jatara, Arrangements For the World’s Largest Tribal Festival Medaram Jatara, Mango News, Medaram Jatara 2022, medaram jatara 2022 dates, Medaram Jatara Latest News, Medaram Jatara News, Medaram Jatara Updates, medaram sammakka sarakka jatara, sammakka sarakka jatara, telangana government, Telangana Government Arrangements For the World’s Largest Tribal Festival Medaram Jatara, Telangana Medaram Jatara, Tribal Festival Medaram Jatara, World’s Largest Tribal Festival Medaram Jatara

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు కూడా అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. మేడారం మహాజాతర వైరస్‌ వ్యాప్తికి కారణం కాకూడదని గిరిజన సంక్షేమ శాఖ అభిప్రాయపడుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

దేశం నలుమూలలనుంచి భక్తులు హాజరుకానున్న ఈ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పూజారుల సమావేశం నిర్వహించి, 2022లో జరగనున్న మహాజాతర తేదీలను నిర్ణయించారు. దీనికి కోటిన్నర మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ తోపాటు మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఏపీ, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకు వస్తుంటారు.

ఈ క్రమంలో ఫిబ్రవరి 16న కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకు వస్తారు. 17న మేడారం సమీపంలోని చిలుకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి తీసుకువస్తారు. 18న అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 19న పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయియడంతో మహా జాతర ముగుస్తుందని పూజారులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 6 =