మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (సెక్యూలర్) జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన కార్యాలయం శనివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఎనభై ఎనిమిదేళ్ల ముదిమి వయసులో ఉన్న దేవెగౌడ.. భారతదేశ 12వ ప్రధానిగా 1996 జూన్ నుంచి 1997 ఏప్రిల్ వరకూ పరిపాలించారు. అంతకుముందు 1994 నుంచి 1996 వరకూ కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ప్రస్తుతం ఆయన పార్లమెంటులో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కర్ణాటక లోని హసన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జేడీ(ఎస్) జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇంతకుముందు ఒకసారి కూడా దేవెగౌడ కరోనా బారిన పడ్డారు. గతేడాది మార్చిలో ఆయనతోపాటు.. ఆయన సతీమణి కూడా అప్పుడు కరోనాకు గురయ్యారు. అయితే, ప్రస్తుతం.. చికిత్స తీసుకుంటున్న దేవెగౌడ.. గత కొన్ని రోజులుగా ఆయనతో సంప్రదించిన వారందరూ కరోనా పరీక్ష పరీక్షించుకోవాలని సూచించారు. అలాగే, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన చెందవద్దని హెచ్‌డీ దేవెగౌడ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF



































