కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన, తెలుగులో ‘శప్తభూమి’ నవలకు అవార్డు

latest political breaking news, Mango News Telugu, national news headlines today, national news updates 2019, National Political News 2019, Sahitya Akademi Awards, Sahitya Akademi Awards 2019, Sahitya Akademi Awards Announced For 23 Languages

కేంద్ర సాహిత్య అకాడమీ-2019 సంవత్సరానికి గానూ అవార్డులను ప్రకటించింది. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కంబర్‌ అధ్యక్షతన డిసెంబర్ 18, బుధవారం నాడు సమావేశమైన అవార్డుల కమిటీ 23 భాషలకు సంబంధించిన రచయితలను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఏడు కవితలు, నాలుగు పుస్తకాలు, ఆరు కథలు, మూడు వ్యాసాలుతో పాటు ఒక్కో నాన్ ఫిక్షన్, ఆత్మకథ మరియు జీవిత చరిత్ర 2019 సాహిత్య అకాడమీ అవార్డులను గెలుచుకున్నాయి. నాలుగు పుస్తకాలలో తెలుగు రచయిత బండి నారాయణస్వామి రాసిన ‘శప్తభూమి’ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ నవలను 18వ శతాబ్దం నాటి రాయలసీమ చరిత్ర నేపథ్యంగా రాశారు. అలాగే ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ రచించిన ‘యాన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్’ అనే నాన్ ఫిక్షన్ కు అవార్డు లభించింది. సాహిత్య అకాడమీ అవార్డు కింద పతకం, శాలువాతో పాటు లక్ష రూపాయల నగదును బహుమతిగా అందిస్తారు. ఫిబ్రవరి 25, 2020న న్యూఢిల్లీలో జరిగే ప్రత్యేకమైన సాహిత్య ఉత్సవంలో ఈ అవార్డులను అందజేస్తారు.

కేంద్ర సాహిత్య అకాడమీ-2019 అవార్డు గ్రహీతలు

తెలుగు – బండి నారాయణ స్వామి
అస్సామీ – జోయిశ్రీ గోస్వామి మహంత
బెంగాలీ – చినమోయ్ గుహ
బోడో – ఫుకాన్ సీ.హెఛ్ బాసుమతరీ
డోగ్రి – ఓం శర్మ జండ్రియారీ
ఇంగ్లీష్ – శశి థరూర్
గుజరాతీ – రతిలాల్ బోరిసాగర్
కన్నడ – విజయ
కాశ్మీరీ – అబ్దుల్ అహాద్ హాజిని
కొంకణి – నిల్బా ఏ.ఖండేకర్
మైథిలి – కుమార్ మనీష్ అరవింద్
మలయాళం – మధుసూదనన్ నాయర్
మణిపురి – ఎల్. బిర్మన్ గోల్ సింగ్
మరాఠీ – అనురాధ పాటిల్
ఓడియా – తరుణ్ కాంతి మిశ్రా
పంజాబీ – కిర్పాల్ కజఖ్
రాజస్థానీ- రామ్‌ స్వరూప్ కిసన్
సంస్కృతం – పెన్నా మధుసూదన్
సంతాలి – కాశీ చరణ్ హెంబ్రం
సింధి – ఈశ్వర్ ముర్జనీ
తమిళం – చో.ధర్మన్
ఉర్దూ – షాఫెయ్ కిద్వయ్

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 11 =