భారత అంతరిక్ష పరిశోధనలో మరో ప్రయోగం విజయవంతమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన వాహననౌక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ -సి52 విజయవంతంగా ప్రయోగించబడింది. ఈమేరకు పీఎస్‌ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. నూతన ఛైర్మన్ S. సోమనాథ్ ఆధ్వర్యంలో 2022 లో ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగం ఎటువంటి లోపం లేకుండా సక్సెస్ అయింది. ఇస్రో మూడు ఉపగ్రహాలను ఖచ్చితత్వంతో వాటిని ఉద్దేశించిన కక్ష్యలో ఉంచింది. ఇస్రో.. సోమవారం ఉదయం 5.59 గంటలకు PSLV C-52 రాకెట్ మూడు ఉపగ్రహాలను ఖచ్చితత్వంతో వాటిని ఉద్దేశించిన కక్ష్యలో ఉంచింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి దీన్ని చేపట్టారు.
అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచ గుర్తింపు పొందిన ఇస్రోకు ఈ ప్రయోగం విజయం చాలా కీలకమైనది. ఈఓఎస్–04, ఐఎన్‌ఎస్-2టీడీ, ఇన్‌స్పైర్ శాట్-1తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) సీ52 కక్ష్యలోకి తీసుకెళ్లింది. లాంచింగ్ అయ్యాక దాదాపు 18 నిమిషాల తర్వాత మూడు ఉపగ్రహాలను వేరు చేసి వాటి కక్ష్యలోకి చేర్చారు. పీఎస్‌ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది, మన శాస్త్రవేత్తల కల నిజమైంది. ఇస్రో త్వరలో PSLV యొక్క మరో ప్రయోగంతో తిరిగి వస్తుంది అని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఇస్రో సిబ్బందిని ఆయన అభినందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ