ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ : ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజాకు అగ్రస్థానం

ICC Test Rankings Ravindra Jadeja Becomes Top Ranked All-Rounder, ICC Test Rankings, Test Rankings, Ravindra Jadeja, All-Rounder Ravindra Jadeja, Ravindra Jadeja Becomes Top Ranked All-Rounder, Top Ranked All-Rounder, All-Rounder, India, India Cricket Live News, India Cricket Live Updates, Test Match 2022 Live Updates, Test Match 2022 News, Test Match 2022 Updates, Cricket, Cricket Latest News, Cricket Latest Updates, Mango News, Mango News Telugu,

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. టెస్టుల్లో టాప్-10 ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలిటెస్టులో జడేజా 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడమే కాకుండా, రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 9 వికెట్లు తీసాడు. దీంతో తాజా ర్యాంకింగ్స్ లో నంబర్ 1 ర్యాంకు దక్కించుకున్నాడు. అయితే జడేజా ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి కాదు. అలాగే వెస్టిండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్ నెంబర్ 2 స్థానంలో, భారత్ బౌలింగ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ 3వ స్థానాల్లో నిలిచారు.

ఇక బ్యాటింగ్ విభాగంలో భారత్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ ఏడు నుంచి ఐదో స్థానానికి (763) చేరుకోగా, కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ర్యాంక్ దిగి 6వ (761)స్థానంలో ఉన్నాడు. యువ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ 10 ర్యాంకు దక్కించుకున్నాడు. భారత బ్యాటర్లలో టాప్-10 ర్యాంకింగ్స్ లో ఈ ముగ్గురే ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ మార్నస్ లబుషెన్ 936 రేటింగ్ తో అగ్రస్థానంలో, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌ జో రూట్ రెండో స్థానంలో (872), ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ మూడోస్థానంలో (851), న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (844) రేటింగ్ తో నాలుగో స్థానంలో నిలిచారు.

మరోవైపు ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో పాట్ కమ్మిన్స్ 892 పాయింట్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ బౌలర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో స్థానంలో (850), కసిగో రబడా మూడో స్థానంలో (835), షాహిన్ అఫ్రీది నాలుగో స్థానంలో (822) నిలిచారు. భారత్ జట్టు తరఫున టాప్‌-10 బౌలింగ్ ర్యాంకింగ్స్ లో రవిచంద్రన్‌ అశ్విన్‌ తో పాటుగా జస్ప్రీత్ బుమ్రా 10 స్థానంలో (766) ఉన్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ