మార్చి 14 నుంచి పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు, ఏకకాలంలోనే ఉభయసభల నిర్వహణ

Parliament Budget Session Second Phase will Commence From March 14th, Parliament Budget Session Second Phase, Parliament Budget Session, Budget Session Second Phase will Commence From March 14th, Parliament Budget, Budget Session, Budget Session Second Phase, Parliament Budget Session 2022, 2022 Parliament Budget Session, Parliament Budget Session Latest News, Parliament Budget Session Latest Updates, Parliament Budget Session Live Updates, Budget, Parliament, 2nd part of Parliament Budget Session to start on March 14, second part of Budget Session on March 14, Budget Session starting 14 March, The second phase of the budget session will start from 14 March, Budget session of Parliament, Rajya Sabha, Lok Sabha, Budget Session 2022 Highlights, Second part of Parliament's Budget Session will start from 14 March, Mango News, Mango News Telugu,

పార్లమెంటు బడ్జెట్-2022 మొదటి విడత సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 11న ముగిసిన సంగతి తెలిసిందే. ఇక పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు మార్చి 14, సోమవారం నాడు ప్రారంభమై, ఏప్రిల్ 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొదటి విడతలో రాజ్యసభ (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు), లోక్‌సభ (సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు) వేర్వేరు సమయాల్లో సమావేశమయ్యాయి.

కాగా దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభలను ఏకకాలంలో నిర్వహించనున్నారు. ఏకకాలంలోనే సమావేశాల నిర్వహణకు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. ఉభయ సభలు కూడా ఉదయం 11 గంటల నుంచి సమావేశం కానున్నాయి. అలాగే సభ్యుల సిట్టింగ్ కోసం భౌతిక దూరం పాటించేలా లోక్‌సభ, రాజ్యసభల్లో చాంబర్స్ మరియు గ్యాలరీలను కూడా ఉపయోగించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + four =