ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరోసారి తన సత్తాను నిరూపించుకుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 255 సీట్లను సొంతం చేసుకుంది. ఇక బీజేపీ కూటమి మొత్తం 273 స్థానాలను కైవసం చేసుకుంది. యూపీలో 37 ఏళ్ల తరువాత అధికారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రికార్డ్ సృష్టించారు. గోరఖ్‌పూర్ అర్బన్ స్థానంలో యోగి ఆదిత్యనాథ్ లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. యోగి ఆదిత్యనాథ్ నేడు ఢిల్లీకి చేరుకొని రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్పు తదితర అంశాలపై బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించనున్నారు.
యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ సీఎం పీఠం దక్కించుకునేందుకు 202 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా, బీజేపీ సొంతంగానే ఆ మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. ఈ ఘనవిజయంతో రాష్ట్రంలో బీజేపీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతుంది. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, ఎంఐఎం పార్టీలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (403): (గెలుపు)
–> బీజేపీ+: 273 స్థానాల్లో గెలుపు
- బీజేపీ: 255
- అప్నాదళ్ (సోనియల్): 12
- నిషద్ : 6
–> సమాజ్ వాదీ పార్టీ+: 125 స్థానాల్లో గెలుపు
- సమాజ్ వాదీ పార్టీ: 111
- ఆర్ఎల్డీ: 8
- సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ: 6
–> కాంగ్రెస్: 2 స్థానాల్లో గెలుపు
–> బీఎస్పీ : 1 స్థానంలో గెలుపు
–> ఇతరులు: 2 స్థానాల్లో గెలుపు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ