కేంద్రం కీలక నిర్ణయం, మార్చి 31 నుంచి దేశంలో కరోనా నిబంధనలు ఎత్తివేత, మాస్కు కొనసాగింపు

COVID-19 Restrictions Except Masks in India To End on March 31 Announces Central Government, Central Government Announces COVID-19 Restrictions Except Masks in India To End on March 31, COVID-19 Restrictions Except Masks in India To End on March 31, COVID-19 Restrictions, COVID-19 Restrictions In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, India Department of Health, India coronavirus, India coronavirus News, India coronavirus Live Updates, Mango News, Mango News Telugu,

దేశంలో కోవిడ్-19 పూర్తిగా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయంచింది. కానీ, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి ఎప్పటిలాగే కొనసాగుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టించిన అత్యంత ప్రాణాంతకమైన మహమ్మారి కోవిడ్-19 దేశంలో వెలుగుచూసిన రెండు సంవత్సరాల తరువాత తొలిసారిగా అన్ని కోవిడ్-19 నియంత్రణ చర్యలను, నిబంధనలను మార్చి 31 నుండి ముగించాలని హోం మంత్రిత్వ శాఖ వెల్లడించటం విశేషం. కమ్యూనికేషన్, కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా దీనిపై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమాచారం అందించారు.

గడచిన రెండు సంవత్సరాలుగా కరోనా నిర్వహణకు సంబంధించిన రోగనిర్ధారణ, నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్, చికిత్స, టీకాలు వేయడం, ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ అంశాలకు సంబంధించి గణనీయమైన సామర్థ్యాలను గణనీయంగా అభివృద్ధి చేశామని చెప్పారు. అలాగే కోవిడ్ కు సంబంధించి సాధారణ ప్రజలకు అవగాహన వచ్చిందని ఆయన అన్నారు. దేశంలో కోవిడ్-19 నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం మార్చి 24, 2020న మొదటిసారిగా విపత్తు నిర్వహణ చట్టం, (DM చట్టం) 2005 కింద ఆదేశాలు మరియు మార్గదర్శకాలను జారీ చేసింది మరియు వీటిని వివిధ సందర్భాల్లో సవరించారు. అయితే ఒకవేళ రాష్ట్రాలలో కేసులు పెరిగే పరిస్థితులు ఏర్పడుతుంటే మాత్రం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిబంధనలు విదించుకోవచని కేంద్ర హోం శాఖ తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 14 =