ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనవరి 8, బుధవారం నాడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసి, మార్చి 3వ తేదీలోపు ఎన్నికలను పూర్తి చేస్తామని పేర్కొంది. ఎన్నికల సంఘం అఫిడవిట్ లో పేర్కొన్న విధంగా ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. పంచాయతీ ఎన్నికలను సంబంధించి ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ చేసి, మార్చి 3నాటికి ఎన్నికలు పూర్తి చేస్తామని కోర్టుకు తెలిపింది. అలాగే జనవరి 17న స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి 15 లోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేస్తామని చెప్పారు. రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, ఫిబ్రవరి 10న ఎన్నికల ఫలితాలు వెలువరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కాబోతుంది.
[subscribe]