దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 3,377 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 29, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,72,176 కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనాతో 60 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,23,753కి పెరిగింది. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మిజోరాం, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
దేశంలో 17,801 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.74 శాతం:
దేశంలో ప్రస్తుతం 17,801 (0.04%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 2496 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,25,30,622 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. అలాగే ఏప్రిల్ 28, గురువారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 83.69 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్ 28న 4,73,635 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ