షాద్ నగర్ నియోజకవర్గం, కొత్తూర్ మండల పరిధిలోని పెంజర్ల గ్రామంలో ప్రొక్టర్ అండ్ గాంబిల్ సంస్థ యొక్క లిక్విడ్ డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, శాసన సభ్యులు అంజయ్య యాదవ్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇది దేశంలో ప్రొక్టర్ అండ్ గాంబిల్ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి లిక్విడ్ డిటర్జెంట్ తయారీ యూనిట్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పి అండ్ జి ఆధ్వర్యంలో రూ.200 కోట్లపైగా పెట్టుబడులతో నెలకొల్పిన యూనిట్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో డిటర్జెంట్ లిక్విడ్ అధికంగా వినియోగంలోకి వస్తుందని తెలిపారు. ఈ పరిశ్రమ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
కంపెనీ యొక్క ఫ్యాబ్రిక్ కేర్ బ్రాండ్లు అయిన ఏరియల్, టైడ్ అండ్ బేబీ కేర్ బ్రాండ్ ప్యాంపర్‌లను ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించే కొత్త లిక్విడ్ డిటర్జెంట్ యూనిట్‌ను ఏర్పాటు కోసం పి అండ్ జి సంస్థ సుమారు రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రుతుక్రమ ఆరోగ్యం మరియు పరిశుభ్రత విద్యలో భాగస్వామిగా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వంతో పి అండ్ జి సంస్థ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో పి అండ్ జి సంస్థ సుమారు 1.3 లక్షల శానిటరీ ప్యాడ్‌లను కూడా విరాళంగా అందించింది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కమీషనర్ కృష్ణ భాస్కర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ