గణతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

Mango News Telugu, Political Updates 2020, Republic Day 2020, Republic Day Celebrations, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Republic Day Celebrations
గణతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జనవరి 17, శుక్రవారం నాడు బి.ఆర్.కె.ఆర్. భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జనవరి 26వ తేదీ ఉదయం పబ్లిక్ గార్డెన్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడానికి వివిధ శాఖల అధికారులు పకడ్భంది ఏర్పాట్లు చేపట్టాలని సోమేశ్ కుమార్ ఆదేశించారు. వేడుకలకు అవసరమైన పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు, బారికేడింగ్ తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, డిజిపి మహేందర్ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

[subscribe]