దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 3,962 పాజిటివ్ కేసులు, 26 మరణాలు నమోదయ్యాయి. దీంతో జూన్ 4, శనివారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,31,72,547 కు, మరణాల సంఖ్య 5,24,677 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 0.89 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 0.77 శాతంగా ఉంది.
అలాగే గత 24 గంటల వ్యవధిలో 2,697 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,26,25,454 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.73 శాతం గానూ, మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 22,416 (0.05%) మంది చికిత్స పొందుతున్నారు. కాగా దేశంలో గత 24 గంటల్లో 4,45,814 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 85.22 కోట్లు (85,22,09,788) దాటింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF