ఆంధ్రప్రదేశ్ : పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల సోమవారానికి వాయిదా

Andhra Pradesh SSC-2022 Results Release Postponed to June 6th, Andhra Pradesh SSC-2022 Results Release Postponed, SSC-2022 Results Release Postponed to June 6th, AP Tenth Class Exams-2022 Results to be Declared on June 6th, AP SSC Exams-2022 Results to be Declared on June 6th, AP X Class Exams-2022 Results to be Declared on June 6th, June 6th, AP X Class Exams-2022 Results, AP SSC Exams-2022 Results, AP Tenth Class Exams-2022 Results, 2022 AP Tenth Class Exams Results, AP Tenth Class Exams Results, AP SSC Class 10th Result 2022 is scheduled to be declared tomorrow, AP 2022 SSC Results, AP SSC Results, AP Board 10th Class Results 2022, Directorate of Government Examination Andhra Pradesh, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి పరీక్ష ఫలితాల విడుదల జూన్ 6, సోమవారానికి వాయిదా పడింది. ముందుగా పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్ 4, శనివారం విడుదల చేయనున్నట్టు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ శనివారం ఉదయం 11గంటలకు విజయవాడలో ఫలితాలను విడుదల చేయనున్నట్టు తెలిపారు. అయితే అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లుగా తాజాగా అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు-2022 ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 6,21,799 మంది విద్యార్థిని, విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.

మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. 2019 తరువాత ఈ ఏడాదే పరీక్షలు నిర్వహించారు. పదో తరగతిలో ఏడు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించడంతో పాటుగా, తొలిసారిగా సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ ను అందించారు. అలాగే ఈసారి గ్రేడ్స్ రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫలితాలను సోమవారం నాడు https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 14 =