భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కన్న కలలు దేశంలో ఎక్కడా లేకున్నా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పరిపూర్ణంగా నెరవేరుతున్నాయని రాష్ట్ర బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా భావితరాల అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఆయన కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని తాహెర్ కొండాపూర్ గ్రామానికి కేటాయించిన దళితబంధు యూనిట్లను పంపిణీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు మంత్రి గంగుల అందించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా దళితులు ఆర్థికంగా, సామాజికంగా అణిచివేయబడ్డారని, ఈ క్రమంలో రాష్ట్రంలోని దళితులందరూ ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే ‘దళిత బంధు’ పథకం ప్రవేశపెట్టారని, అందుకే ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా యూనిట్లను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పథకం ద్వారా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక యూనిట్ గా తీసుకొని సమిష్టిగా పనిచేసుకునే అవకాశం ఉందని, నిన్నటి వరకు డ్రైవర్లుగా ఉన్నవారు నేడు ఓనర్లు అవుతున్నారని తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మన పల్లెలను అభివృద్ధి చేసుకుంటున్నామని, తద్వారా చక్కని పారిశుధ్యం ఏర్పడి ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ