కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జూన్ 28, 29 తేదీల్లో గుడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) కౌన్సిల్ భేటీ జరగనుంది. జీఎస్టీ కౌన్సిల్ యొక్క 47వ సమావేశం జూన్ 28, మంగళవారం, జూన్ 29, బుధవారం నాడు శ్రీనగర్ లో జరుగుతుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయం ట్విట్టర్ లో వెల్లడించింది. ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. ముఖ్యంగా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై రాష్ట్ర మంత్రుల ప్యానెల్ నివేదికపై కీలకంగా చర్చించనున్నారు. అలాగే క్యాసినోలు, రేస్ కోర్సులు మరియు ఆన్‌లైన్ గేమింగ్‌పై జీఎస్టీ రేటుపై కూడా చర్చించనున్నారు.
మరోవైపు జీఎస్టీ (రాష్ట్రాలకు నష్టపరిహారం) చట్టం, 2017లోని నిబంధనల ప్రకారం జీఎస్టీ అమలు కారణంగా ఉత్పన్నమయ్యే ఆదాయ నష్టపరిహారం కోసం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందించడంపై హామీ ఇవ్వబడిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువు ముగుస్తుండడంతో ఈ విధానాన్ని ఐదేళ్లకు మించి పొడిగించాలని అనేక బీజేపీయేతర రాష్ట్రాలు ఒత్తిడి చేస్తున్నందున నేపథ్యంలో ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చించే అవకాశమునట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY