ఇంధన ధరలు అత్యధిక స్థాయికి చేరిన నేపథ్యంలో.. విమానయాన చార్జీల పెంపునకు స్పైస్‌జెట్ డిమాండ్

SpiceJet CMD Ajay Singh Demands 15% Hike in Airfare as Jet Fuel Prices Touch All Time High, SpiceJet CMD Ajay Singh Demands 15% Hike in Airfare, Ajay Singh Demands 15% Hike in Airfare, Jet Fuel Prices Touch All Time High, 15% Hike in Airfare, SpiceJet CMD Ajay Singh, SpiceJet CMD Demands 15% Hike in Airfare, SpiceJet CMD, SpiceJet CMD Ajay Singh calls for 15% fare hike in Airfare, SpiceJet demands 15% hike in airfare, Jet Fuel Rates Touch All Time High, sharp increase in aviation turbine fuel, Ajay Singh Chairman and Managing Director Of SpiceJet, Airfare Hike News, Airfare Hike Latest News, Airfare Hike Latest Updates, Airfare Hike Live Updates, Mango News, Mango News Telugu,

జెట్ ఇంధన ధరలు అత్యధిక స్థాయికి చేరినందున విమాన ఛార్జీలను 15% పెంచాలని ‘స్పైస్‌జెట్’ కంపెనీ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్పైస్‌జెట్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిలో ఆయన యుఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడటం విమానయాన సంస్థలను మరింత గణనీయంగా ప్రభావితం చేస్తుందని, ఎందుకంటే మా వ్యయం డాలర్‌తో ముడిపడి ఉంటుందని తెలిపారు. ఒకవైపు జెట్ ఇంధనం గణనీయంగా పెరిగిందని, మరోవైపు ధరలు మరియు రూపాయి క్షీణత కారణంగా దేశీయ విమానయాన సంస్థలకు తక్షణమే ఛార్జీలను పెంచే అవకాశం లేకుండా పోయిందని వెల్లడించారు. ఈ క్రమంలో మా కార్యకలాపాల ఖర్చు మెరుగ్గా ఉండేలా చూసుకోవడానికి ఛార్జీలలో కనీసం 10-15% పెరుగుదల అవసరమని మేము విశ్వసిస్తున్నామని తెలిపారు.

ఇక ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ లేదా జెట్ ఫ్యూయల్‌ పెరుగుదల కారణంగా విమానయాన సంస్థ యొక్క కార్యాచరణ ఖర్చులలో 40% మేర పెరగనున్నాయని అజయ్ సింగ్ వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం జెట్ ఇంధనంపై మరింత ఎక్కువ వ్యాట్ మరియు సుంకాన్ని విధిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలోకెల్లా అధికం అని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ ఛార్జీలు పెంచినట్లయితే అధిక ఛార్జీల కారణంగా ఫార్వర్డ్ బుకింగ్‌లు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా 16.3% పెంపు తర్వాత ఫ్యూయెల్ ధర గురువారం న్యూఢిల్లీలో కిలోలీటర్‌కు రూ. 1.41 లక్షలకు చేరుకుంది. ఫ్యూయెల్ ధరలు ఆరు నెలల్లో 91% మేర రెండింతలు పెరిగాయి. పెరుగుతున్న ధరలు మరియు క్షీణిస్తున్న రూపాయిని తట్టుకోవడానికి తమకు ఉన్న ఏకైక ఎంపిక ఛార్జీల పెంపు మాత్రమేనని విమానయాన సంస్థలు చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eleven =