విశాఖపై సీఎం జగన్‌కు ప్రత్యేక అభిమానం, భవిష్యత్తులో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తాం – మంత్రి విడదల రజిని

AP Minister Vidadala Rajini Participates District Review Meet in Visakhapatnam Today, Minister Vidadala Rajini Participates District Review Meet in Visakhapatnam Today, Vidadala Rajini Participates District Review Meet in Visakhapatnam Today, District Review Meet in Visakhapatnam Today, District Review Meeting in Visakhapatnam Today, District Review Meet, Visakhapatnam, AP Minister Vidadala Rajini, Minister Vidadala Rajini, Vidadala Rajini, AP Minister For Health, AP Health Minister, Vidadala Rajini AP Health Minister, District Review Meet News, District Review Meet Latest News, District Review Meet Latest Updates, District Review Meet Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణానికి ప్రత్యేక స్థానం ఉందని, అలాగే విశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన అభిమానమని పేర్కొన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని. గురువారం జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సమీక్ష అనంతరం మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ.. ఏపీలో ఎక్కడా జరగని అభివృద్ధి పనులు విశాఖ జిల్లాలో జరుగుతున్నాయని, రానున్న రోజుల్లో విశాఖ మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అభివృద్ధికి సంబంధించి సమావేశంలో చర్చలు జరిపినట్లు మంత్రి చెప్పారు.

ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలో చాలా రోజులుగా అపరిష్కృతంగా ఉన్న సింహాచలం భూ సమస్య, హౌసింగ్, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర పనులకు సంబంధించి సమావేశంలో మంత్రి విడదల రజని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిపారు. సీఎం జగన్ రాష్ట్రమంతటా ఎలాంటి అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందజేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక నిందలు వేస్తున్నాయని శ్రీనివాస్ అన్నారు. అలాగే ఋషికొండ విషయంలో కూడా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అప్పటి టీడీపీ ప్రభుత్వమే కొండపై చెట్లను తొలగించి చదును చేసిందని తెలిపారు. వారు చేస్తే అభివృద్ధి, సీఎం జగన్ చేస్తే విధ్వంసమా అని ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − 2 =