ఇంగ్లాండ్ లోని బర్మింగ్‌హామ్ వేదికగా జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు కామన్ వెల్త్ గేమ్స్-2022 జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ గేమ్స్ కు భారత్ నుంచి వెళ్లే అథ్లెట్ల బృందంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 20, బుధవారం ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ ఇంటరాక్షన్ కు అథ్లెట్లతో పాటుగా వారి కోచ్‌లు కూడా హాజరుకానున్నారు. అథ్లెట్లు ప్రధాన క్రీడా ఈవెంట్‌లలో పాల్గొనడానికి ముందుగా వారికి ప్రేరణను అందించడం, స్ఫూర్తి నింపడం కోసం ప్రధాని మోదీ చేస్తున్న చేసిన నిరంతర ప్రయత్నంలో ఒక భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా ప్రధానిమంత్రి కార్యాలయం వెల్లడించింది.
గత సంవత్సరం టోక్యో 2020 ఒలింపిక్స్‌కు వెళ్లే భారతీయ అథ్లెట్ల బృందంతో పాటు టోక్యో 2020 పారాలింపిక్ గేమ్స్ కోసం భారత పారా-అథ్లెట్ల బృందంతో కూడా ప్రధాని సంభాషించినట్టు తెలిపారు. అలాగే ఈవెంట్ అనంతరం అథ్లెట్స్ దేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారితో ప్రధాని మోదీ సమావేశమయి, సంభాషించారని పేర్కొన్నారు. ఇక బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్ వెల్త్ గేమ్స్-2022 లో భారత్ నుంచి మొత్తం 215 మంది అథ్లెట్లు, 19 క్రీడా విభాగాలలో 141 ఈవెంట్‌లలో పాల్గొని భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY