తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె మాతృమూర్తి ‘గుగులోతు దస్మి’ కన్నుమూశారు. సుమారు పది రోజుల క్రితం అనారోగ్యంతో 86 సంవత్సరాల దస్మిని హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్చించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆమె ఈరోజు గుండె పోటుతో మృతి చెందారు. కాగా మంత్రి సత్యవతి రాథోడ్ తల్లి గుగులోత్ దస్మి మరణం పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దస్మి మరణం పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తమ సంతాపం ప్రకటించారు. మంత్రి సత్యవతికి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ చేసి ఆమెతో మాట్లాడారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ‘దస్మి’ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతర సమయంలో మంత్రి సత్యవతి తండ్రి ‘లింగ్యా నాయక్’ కూడా అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ