ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఫోన్ లో మాట్లాడి గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సీఎం వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేస్తూ, “గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు జీవితం గడపాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేస్తూ “గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు మంచి ఆరోగ్యం మరియు ప్రజల సేవలో దీర్ఘకాలం కొనసాగాలని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ, ” గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ పురోగమనానికి మీ వంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఎంతో ఉపయుక్తమని భావిస్తున్నాను. అవినీతి లేని సమాజం ఆవిష్కారం కావాలన్న మీ ఆకాంక్ష నేటి తరం రాజకీయవేత్తలకు ఆదర్శం. ఆరోగ్యకరమైన దీర్ఘాయుస్సును మీకు ఆ భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను” అని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY


































