పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్.. మునుగోడులో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కదు!

Komatireddy Rajagopal Reddy Responds Over TPCC President Revanth Reddy Remarks on Him, MLA Komatireddy Rajagopal Reddy Responds Over TPCC President Revanth Reddy Remarks on Him, Rajagopal Reddy Responds Over TPCC President Revanth Reddy Remarks on Him, TPCC President Revanth Reddy Remarks, Revanth Reddy Remarks, TPCC President Remarks, Komatireddy Rajagopal Reddy Resigns to Party and MLA Post, Telangana Senior Congress Leader Komatireddy Rajagopal Reddy, Senior Congress Leader Komatireddy Rajagopal Reddy, Munugode MLA Komatireddy Rajagopal Reddy, Telangana Senior Congress Leader, MLA Komatireddy Rajagopal Reddy, Komatireddy Rajagopal Reddy, Rajagopal Reddy Resignation, By-polls in Munugodu, TPCC President Revanth Reddy, Revanth Reddy, Rajagopal Reddy Resignation News, Rajagopal Reddy Resignation Latest News, Rajagopal Reddy Resignation Latest Updates, Rajagopal Reddy Resignation Live Updates, Mango News, Mango News Telugu,

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఒక్క రోజులోనే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో బుధవారం ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంకా చంద్రబాబు డైరెక్షన్‌లోనే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో పక్కా ప్లాన్‌ ప్రకారం టీడీపీని ఖతం చేశాడని, త్వరలోనే కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తాడని జోస్యం చెప్పారు. పీసీసీ ప్రెసిడెంట్‌ అయి రాష్ట్రాన్ని దోచుకోవాలనుకుంటున్నాడని, పీసీసీ కాదు.. ఒకవేళ ఏఐసీసీ ప్రెసిడెంట్‌ అయినా సరే రేవంత్‌ను ఎవరూ నమ్మరని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

కొడంగల్‌లో ఓడిపోయిన ఆయన, పాలమూరు ఎంపీగా పోటీ చేయాల్సిందని, కానీ సీమాంధ్రుల ఓట్ల కోసమే మల్కజ్‌గిరిలో పోటీ చేశాడని రాజగోపాల్‌ రెడ్డి మండిపడ్డారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని, ఆయన వ్యాపారస్తులను బ్లాక్‌మెయిల్‌ చేస్తాడని ఆరోపించారు. సోనియాగాంధీని కించపరిచేలా తానెప్పుడూ మాట్లాడలేదని, ఆత్మగౌరవం చంపుకుని రేవంత్‌ కింద పనిచేయాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి అన్నారు. కాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా వ్యవహారంపై స్పందించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. స్వార్ధ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆయన పార్టీ మారుతున్నారని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఈ నెల 5వ తేదీన మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని, దీనిద్వారా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతామని అన్నారు. అలాగే మునుగోడు ఉపఎన్నికల్లో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =