రిలయన్స్ అధినేత ముఖేష్‌ అంబానీ కీలక ప్రకటన.. దీపావళి నాటికి దేశంలోని ముఖ్య నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి

Reliance AGM 2022 Mukesh Ambani Announces Jio 5G To be Launched by Diwali in Key Cities of India, Reliance To Launch Jio 5G By Diwali, Mukesh Ambani To Launch Jio 5G, Mango News , Mango News Telugu, Jio 5G Rollout By Diwali, Reliance AGM 2022 , Reliance AGM Latest News And Updates, RIL AGM 2022 Highlights, Reliance AGM Live Updates, Jio 5g Launch In Metro Cities, Jio 5G News And Live Updates, Mukesh Ambani , Mukesh Ambani News

దీపావళి నాటికి దేశంలోని ముఖ్య నగరాల్లో జియో 5G సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు రిలయన్స్ అధినేత ముఖేష్‌ అంబానీ. ఈ మేరకు ఆయన సోమవారం 45వ రిలయన్స్​ ఏజీఎం (వార్షిక సర్వసభ్య సమావేశం)లో దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన 5జీ, రిలయన్స్ ఫ్యూచర్ యాస్పెక్ట్స్, భవిష్యత్తులో చేపట్టాల్సిన ప్రాజెక్టులు తదతర విషయాలపై పలు నిర్ణయాలు వెల్లడించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ని నిర్మించడానికి జియో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నట్లు అంబానీ తెలిపారు.

ఇక వర్చువల్ రియాలిటీ ప్లాట్‌ఫారమ్ మరియు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వేలకోట్ల టర్నోవర్ కలిగిన ఒక కంపెనీ వార్షిక సాధారణ సమావేశాన్ని నిర్వహించే ప్రపంచవ్యాప్తంగా బహుశా ఇదే మొదటిసారిగా విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సందర్భంగా తన తదనంతరం వ్యాపార బాధ్యతలను వారసులకు అప్పజెప్తున్నట్లు ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. దీని ప్రకారం.. కుమారుడు ఆకాష్ అంబానీకి రిలయన్స్ జియో బాధ్యతలు, రిలయన్స్ న్యూ ఎనర్జీ వ్యాపార బాధ్యతలు అనంత్ అంబానీకి, అలాగే రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని కుమార్తె ఇషా అంబానీకి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖేష్‌ అంబానీ ప్రకటించిన కీలక నిర్ణయాలు..

  • దీపావళి నాటికి ముఖ్య నగరాల్లో జియో 5G సేవలు ప్రారంభం, అలాగే 2023 డిసెంబ‌ర్ నాటికి దేశ‌వ్యాప్తంగా 5జీ సేవ‌లు పూర్తిగా అందుబాటులో వస్తాయి.
  • ముందుగా ఎంపిక చేసిన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌క‌తా నగరాల్లో జియో 5జీ సేవ‌లు ప్రారంభిస్తాం.
  • జియో ద్వారా డిజిట‌ల్ క‌నెక్టివిటీ పెరిగి తద్వారా జియో 5జీతో సుమారు వంద మిలియ‌న్ల ఇళ్లను క‌నెక్ట్ చేయగలుగుతాం.
  • దీనిద్వారా వినియోగదారులకు అత్యంత నాణ్యమైన సేవలు లభిస్తాయి, అలాగే మెరుగైన డిజిటల్​ ఎక్స్​పీరియన్స్​ లభిస్తుంది.
  • 5జీ లెటెస్ట్​ వర్షెన్. ‘స్టాండ్ ​అలోన్​-5జీ’ని తీసుకొస్తున్నాం, దీనితో 4జీ నెట్​వర్క్​కు అసలు సంబంధమే ఉండదు.
  • భారతదేశంలో 5G సేవల ద్వారా ప్రస్తుతం కనెక్ట్ చేయబడిన 800 మిలియన్ల ఇంటర్నెట్ పరికరాలు కేవలం ఒక సంవత్సరంలో 1.5 బిలియన్ మార్కుకు చేరుకుంటాయి.
  • ఇక దేశవ్యాప్తంగా జియో 5జీ సేవల కోసం రూ. 2లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో జియో అతివేగంగా విస్తరిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =