జాతీయ రాజకీయాల్లోకి రావాలని నన్ను ఆహ్వానిస్తున్నారు, పోదామా? – పెద్దపల్లి సభలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

CM KCR Interesting Comments on Entry into National Politics in Public Meeting at Peddapalli Today, CM KCR Comments Entry Into National Politics, CM KCR Public Meeting at Peddapalli , Mango News, Mango News Telugu, CM KCR To Inaugurate Peddapalli Collectorate, Peddapalli Collectorate Office Opening, CM KCR Entry Into National Politics, CM KCR Latest News And Updates, CM KCR, TRS Party, Indian National Politics

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయాల్లోకి ఆయన అడుగు పెట్టనున్నారనే వార్తలు ఇటీవలి కాలంలో జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఆయన దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సీఎం వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ మేరకు ఆయన సోమవారం పెద్ద‌ప‌ల్లి జిల్లాలో స‌మీకృత క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు.

ముఖ్యమంత్రి ప్రసంగం లోని కొన్ని కీలక అంశాలు..

  • దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల నుంచి దాదాపు 100 మంది రైతు నాయ‌కులు మన రాష్ట్రానికి వ‌చ్చారు. మనం నిర్మించుకున్న ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌ను సందర్శించారు.
  • తెలంగాణలో అమ‌ల‌వుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, సంక్షేమ పథకాలు మా ద‌గ్గ‌ర లేవు అని తెలిపారు.
  • మీలాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లో ఉండాలని, జాతీయ రాజ‌కీయాల్లోకి రండి అని నన్ను ఆహ్వానించారు. పోదామా జాతీయ రాజ‌కీయాల్లోకి?
  • గుజ‌రాత్ మోడ‌ల్ అని చెప్పి దేశ ప్ర‌జ‌ల‌ను ప్రధాని మోదీ మోసం చేస్తున్నారు, ఆయన తీరుతో విదేశాల్లో సైతం దేశ ప్రతిష్ట దెబ్బతింటోంది.
  • మద్యపానం వద్దన్న గాంధీ మహాత్ముడు పుట్టిన గుజరాత్ రాష్ట్రంలో నేడు మద్యం ఏరులై పారుతోంది, దీనిపై ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి.
  • రైతుల‌కు మేలు చేసేలా మేము నిరంతరం కరెంట్ ఇస్తుంటే, వాటికి మీటర్లు పెట్టాలని కోరుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం?
  • అలాగే పేద‌ ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, ఉచితాలు అనే వంకతో ఆ పథకాలను బంద్ చేయాల‌ని ప్రయత్నిస్తున్నారు.
  • ధాన్యం కొనమంటే కేంద్రానికి చేతకాలేదు. తెలివి తక్కువ నిర్ణయాల వల్ల గోధుమలు, బియ్యం దిగుమతి చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
  • ఒకవైపు దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మతాల పేరుతొ వైషమ్యాలు పెంచేలా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు.
  • 2024లో ప్రధాని మోదీని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఈసారి కేంద్రంలో వచ్చేది ఖచ్చితంగా రైతుల ప్రభుత్వమే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 5 =