టాటా గ్రూప్ మాజీ చైర్మన్, షాపూర్‌జీ-పల్లోంజీ గ్రూప్ ప్రస్తుత చైర్మన్ సైరస్ మిస్త్రీ సైరస్ మిస్త్రీ దుర్మరణం చెందారు. ఆదివారం మహారాష్ట్ర లోని ముంబై సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ముంబైకి 135 కిలోమీటర్ల దూరంలో పాల్ఘర్‌లోని ఛరోటీ దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో సూర్య నదిపై ఉన్న వంతెనపై ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు వారు ధృవీకరించారు. ప్రమాదం సమయంలో కారులో మిస్త్రీతో పాటు, జహంగీర్ పండోల్, అనహిత పండోల్ మరియు డారియస్ పండోల్ కారులో ఉన్నారు. వీరిలో జహంగీర్ పండోలే మరణించగా.. గాయపడిన భార్యాభర్తలైన అనహిత పండోల్ మరియు డారియస్ పండోల్ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.
54 సంవత్సరాల మిస్త్రీ గుజరాత్ లోని ఉద్వాడ నుంచి ముంబైకి మెర్సిడెస్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పాల్ఘర్ ఎస్పీ వివరించారు. కారు వేగంగా వెళ్తూ రాంగ్ సైడ్ నుంచి (ఎడమవైపు నుంచి) మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించిందని ఆయన అన్నారు. కాగా రతన్ టాటా తర్వాత టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సైరస్ మిస్త్రీ, ఆ తర్వాత భారతదేశంలోనే అత్యంత ఉన్నతమైన బోర్డ్‌రూమ్ తిరుగుబాటులో పదవీచ్యుతుడయ్యాడు. అయితే రతన్ టాటాతో విభేదించి టాటా సంస్థల నుంచి బయటికొచ్చిన మిస్త్రీ కొన్నాళ్లుగా షాపూర్‌జీ-పల్లోంజీ గ్రూప్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా షాపూర్‌జీ-పల్లోంజీ గ్రూప్‌కు టాటా గ్రూప్‌లో 18.4 శాతానికి పైగా వాటా ఉంది. ఇక ప్రమాదంపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర పోలీసులను కోరినట్లు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ