ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, 57 కీలక అంశాలు సహా రూ.1. 26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

AP CM YS Jagan Mohan Reddy Held Cabinet Meeting Approves For The Investments Worth Rs 1.26 Lakh Cr, AP Investments Worth Rs 1.26 Lakh Cr, AP Cabinet Meeting, AP CM YS Jagan To Chair Cabinet Meeting, AP CM YS Jagan Special Cabinet Meeting, Mango News, Mango News Telugu, AP CM YS Jagan To Hold Ts Cabinet Meeting, AP CM YS Jagan Mohan Reddy , AP Cabinet Meeting, AP Government Cabinet, Andhra Pradesh Cabinet Meeting, YSR Congress Party, AP CM YS Jagan Latest News And Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ ముగిసింది. ఏపీ సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్ లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ఈ భేటీలో మొత్తం 57 కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. దీంతోపాటు రూ.1. 26 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆమోదముద్ర వేశారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పలు పథకాలకు అవసరమైన నిధులు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. ఇక ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు ధీటుగా ప్రతిస్పందించాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు.

ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసిన కొన్ని కీలక అంశాలు..

  • గ్రీన్ ఎనర్జీ లో రూ. 81 వేల కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం.
  • అలాగే 21 వేల ఉద్యోగాలు కల్పించే పలు ప్రాజెక్టులకు ఆమోదం.
  • దివ్యాంగులకు ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో 4% రిజర్వేషన్లుకు అంగీకారం.
  • 45-60 ఏళ్లలోపు మహిళలకు ఆర్థికసాయం కోసం వైఎస్సార్‌ చేయూత పథకం అమలుకు ఆమోదం.
  • ఈనెల 22న ప్రారంభించనున్న ఈ పథకం అమలుకు అవసరమైన రూ.4,700 కోట్లు నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్.
  • జల్ జీవన్ మిషన్ అమలుకు రూ.4,020 కోట్లు రుణం తీసుకునేందుకు ఆమోదం.
  • భావనపాడు పోర్టు విస్తరణకు కేబినెట్‌ ఆమోదం.
  • ఒబెరాయ్ గ్రూప్‌కు స్టార్ హోటల్ నిర్మాణానికి 30.32 ఎకరాలు కేటాయింపుకి ఆమోదం.
  • ఒక్కో గ్రామ సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు.
  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ర్యాటిఫికేషన్‌కు గ్రీన్ సిగ్నల్.
  • గ్రేటర్ విశాఖ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం.
  • సచివాలయంలో 85 మంది అదనపు పోస్టులు నియామకానికి అనుమతి.
  • సీఆర్డీఏ అభివృద్ధికి ప్రభుత్వం తరపున బ్యాంకు గ్యారంటీగా రూ.1600 కోట్ల రుణానికి అనుమతి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ